Breaking News

దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డ్ నూతన చైర్మన్ బొర్రా రాధ కృష్ణ మరియు పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పైకొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయింది. కూటమి ప్రభుత్వం దుర్గమ్మ గుడికి ట్రస్ట్ బోర్డును నియమించింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఏపీ ప్రభుత్వం బొర్రా రాధ కృష్ణ( గాంధీ) ను నియమించింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బొర్రా రాధ కృష్ణ , మరియు నూతన పాలకమండలి సభ్యుల తో ఈ ఓ శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) పాల్గొని నూతన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధ కృష్ణ ను పాలకమండలి సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పాలకమండలి ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *