Breaking News

తాగునీటి రిజర్వాయర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని యానాదుల కాలనీ కొండ ప్రాంతంలో నిర్మించిన తాగునీటి వాటర్ రిజర్వాయర్ ను శనివారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. భీమన వారి పేటలో ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చడానికి విఎంసి జనరల్ ఫండ్స్ తో రూ 1 కోటి 70 లక్షలతో వాటర్ రిజర్వాయర్, మెట్లు, పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. 455 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు ద్వారా భీమన్న వారి పేట, అప్పలస్వామి కళాశాల , యానాదుల బజార్, లంబాడి పేట తదితర కాలనీలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా , టీడీపీ సీనియర్ నాయకులు గుర్రం కొండ,46 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పోతినీడి లోకేష్, బాదర్ల శివ, బీ ఎస్ కే పట్నాయక్,మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి కూటమి నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *