Breaking News

గత 6 నెలల్లో మీ శాఖ పనితీరు ఎలా ఉంది ?

-విభాగాధిపతులనుంచి స్పందన కోరిన మంత్రి సత్యకుమార్ యాదవ్
-పనితీరు మధింపుకు 20 అంశాలను సూచించిన మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో (ఏప్రిల్ – సెప్టెంబర్, 2025) వైద్యారోగ్య మంత్రిత్వ శాఖలోని 10 వివిధ విభాగాల పనితీరును సమీక్షించడానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన పంధా చేపట్టారు. ఈ కాలంలో ఆయా విభాగాలు సాధించిన ఫలితాలు, సమస్యలు /అడ్డంకులు పరిష్కారం, సాధించిన మార్పు ఆధారంగా పనితీరు బాగా ఉందా, సంతృప్తి కరంగా ఉందా లేదా అని మీరే చెప్పాలని 10 విభాగాధిపతులకు మంత్రి సూచించారు. 20 అంశాల ఆధారంగా పనితీరును మదింపు చేయాలని మంత్రి సూచించారు.
ఏప్రిల్ – సెప్టెంబర్ కాలానికి సంబందించి వివిధ విభాగాలు అందించే సమాచారం ఆధారంగా మంత్రి సత్యకుమార్ వైద్యరోగ్య శాఖ పనితీరును సమీక్షించనున్నారు. 14,000 ప్రభుత్వ డిస్పెన్సిరీలు, ఆసుపత్రులు, పలు ఆరోగ్య పధకాల అమలుకు సంబంధించి వైద్య సేవలు, పధకాల అమలు నాణ్యత, ఫలితాల మదింపు పై దృష్టి సారించిన మంత్రి వినూత్నంగా విభాగాధిపతుల నుంచే పనితీరు అంచనాలు కోరడం విశేషం.
పనితీరు,ఫలితాలను నిర్దిష్టంగా అంచనా వేయడానికి స్పష్టమైన కొలమానాలుండాలని భావించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఈ దిశగా 20 అంశాలను సూచించారు. ఇవి : వైద్య సేవలు, పధకాల అమలులో మెరుగుకోసం ఆయా శాఖలు ప్రవేశపెట్టిన / సాధించిన ఐదు మార్పులు ఏవి, ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిలో పరిస్కారం చేసిన వాటి వివరాలు, నూతన మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సిబ్బంది నియామకాలు, ఓపి మరియు ఐపి సేవల్లో ప్రగతి, డయాగ్నోస్టిక్ సేవల సంఖ్య మరియు పరికరాల కొనుగోలు, వైద్యులు మరియు ఇతర సిబ్బంది హాజరు, బడ్జెట్ కేటాయింపులు మరియు గత 6 నెలల్లో ఖర్చు వివరాలు, వైద్య సేవల విస్తరణ మరియు నూతన సేవల ప్రారంభం మొదలైనవి.
వివిధ విభాగాధిపతుల నుండి ప్రత్యక్షంగా పనితీరు అంచనాపై స్పష్టమైన స్పందన మరియు 20 వివిధ అంశాలకు సంబంధించి సమాచారం ఆధారంగా త్వరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ చేపట్టానున్న సమీక్షపై మంత్రిత్వ శాఖలో చర్చ జరుగుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *