-శాప్ చైర్మెన్ రవి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ పట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్రప్రదేశ్ కు సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. నారా లోకేష్, బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలు అయ్యిందన్నారు. కూటమి ప్రభుత్వం లో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్టుబడి పెడతాం అనే పరిస్థితి నెలకొందనీ, గత ఐదేళ్ల పాటు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రకు రాలేదని విమర్శలు గుప్పించారు.
విజయవాడ లోని శాప్ కార్యాలయం నందు శాప్ చైర్మన్ రవి నాయుడు, శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ పట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్ర ప్రదేశ్ కు సువర్ణ అధ్యాయమని అన్నారు. గత ఐదేళ్ల పాటు ఒక్క ఆంధ్రకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. నారా లోకేష్, బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలు అయ్యిందన్నారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్టుబడి పెడతాం అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. కేంద్రం సహకారంతో నారా లోకేష్, కృషితో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు పరిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి పరిశ్రమల కల్పన కు నారా లోకేష్, కృషి చేస్తున్నారన్నారు. గతం లో హైదరాబాద్ వేదికగా చంద్రబాబు పరిశ్రమ పెద్దలకు ఆనాడు ఎలా సహకరించారో అలాంటి సహకారం ఇప్పుడు ఉంటుందని పారిశ్రామికవేత్తలు విశ్వసిస్తున్నారన్నారు.రాష్ట్రం కు పెట్టుబడు లు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు, పవన్, లోకేష్, భావిస్తున్నారన్నారు.విశాఖ లో గూగుల్ పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం జరిగిందనీ, ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, చెన్నై , బెంగళూరు గుర్తుకు వచ్చేవివని, రానున్న రోజుల్లో వైజాగ్ గా ఐటీ హబ్ గా నిలుస్తుందన్నారు.
Prajavartha Online Telugu News