విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో గవర్నర్ పేట రాజగోపాలాచారి వీధి నందు “ప్రైమ్ గోల్డ్ హబ్”తాకట్టు లో వున్నా బంగారాన్ని విడిపించి జ్యూయలరీ నూతన దుకాణాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ఇమిటేషన్ గోల్డ్ దుకాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఈ నూతన షోరూం ప్రారంభం స్థానిక ప్రజలకు ఒక గొప్ప అవకాశంగా మారింది, ముఖ్యంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదిక, ప్రైమ్ గోల్డ్ హబ్ జ్యూయలరీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడంలో మరియు కొత్త ఆభరణాలను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉంది అని, ఈ షోరూం ప్రారంభం స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందన్నారు. ఇవాళ దేశీయ మార్కెట్లో గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతు, 10 గ్రాములు బంగారం ధర 13,500 రూపాయలకు చేరింది అని, ఈ ధరల పెరుగుదల సామాన్యులు అందుబాటులో లేని పరిస్థితులు సృష్టిస్తోంది అని, బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో, సామాన్య ప్రజలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. జ్యూయలరీ మార్కెట్ విస్తరిస్తున్న కొద్దీ, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి అని, లాభాపేక్షతో కూడుకున్నది కాదు, ఇది సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తుంది, ఇది తక్కువ ఆదాయం ఉన్నవారికి తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తు, అంతేకాకుండా, ఈ వ్యాపారం విస్తరిస్తున్న కొద్దీ, డిజైనర్లు, తయారీదారులు, విక్రయదారులు వంటి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరియు ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు. ఈ వ్యాపారం కేవలం లాభాపేక్షతో మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలను మరియు సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలి, నాణ్యత, విశ్వసనీయత మరియు కస్టమర్ సేవకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ వ్యాపారం ప్రజల మన్ననలను పొందాలి అని “ప్రైమ్ గోల్డ్ హబ్” జ్యూయలరీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రైమ్ గోల్డ్ హబ్ ఎండీ సంగం రెడ్డి శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రైమ్ గోల్డ్ హబ్ జ్యూయలరీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడంలో మరియు కొత్త ఆభరణాలను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. కస్టమర్ సేవకు ప్రాధాన్యత ఇస్తూ లాభాపేక్షతో కూడుకున్నది కాకుండా, సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు. మా సేవలను నగర ప్రజలతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరారు. పలు రాజకీయ ప్రముఖులు, నగర ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి అరుణ్ కుమార్ (నాని ), కొంపల్లి భాను ప్రకాష్, రామాయన్ కోటి, కొండవీటి ఈశ్వరరావు, హరీష్, రాజనాల పవన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News