విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో, 62వ డివిజన్ పాయకాపురం నందు మహబూబ్ సుభాని షరీఫ్ పండుగ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి ఈ గార్మి నెల పొడవునా సెంట్రల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో అత్యంత పవిత్రతతో నిర్వహించబడే ఈ గార్ని పండుగ ఉత్సవాలలో చురుకుగా ఉంటాయి అని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరినీ అల్లా అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని, ఆ అల్లా యొక్క శుభాశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఇది ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించే ఒక గొప్ప అవకాశం అని, ఈ పండుగ వాతావరణం ప్రజలందరిలో నూతన ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపిందని, ఈ పండుగ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయని, ఇలాంటి వేడుకలు సమాజంలో శాంతిని, సంతోషాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్ బాషా, 64వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, 62వ డివిజన్ ఇంచార్జ్ పైడి శ్రీను, డివిజన్ ఇంచార్జ్ మోత్కూరి కాసిం, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం,, డివిజన్ ప్రధాన కార్యదర్శి Sk బాబు,Sk బాజీ, Sk పెద్ద బడే, Sk మెహర్, కోలా శ్రీను, పలగాని భాగ్యలక్ష్మి, పరస అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News