Breaking News

13వ రోజుకి చేరుకున్న పి హెచ్ సి వైద్యుల నిరసన రిలే నిరాహార దీక్ష…

-సంఘీభావం తెలిపిన పలు వైద్య సంఘాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం (ఎపిపిహెచ్‌సిడిఎ) చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారానికి 13వ రోజుకు చేరుకుంది. శుక్రవారం, ధర్నాచౌక్‌లో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జ్ఞానేష్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ నిరసన దీక్షలో నిరసనకారులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ పోరాటం మా ప్రాథమిక హక్కులను సాధించేవరకు కొనసాగిస్తామని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ యొక్క పోరాటం ప్రభుత్వం యొక్క పాలసీ మీద కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని తెలియజేశారు. ప్రభుత్వం తమకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ యొక్క జవాబు దారితనాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం తలుచుకుంటే తమ యొక్క సమస్యలు తీర్చడం క్షణంలో పని అని అదిగాక గతంలో స్వయంగా ప్రభుత్వమే పిహెచ్సి డాక్టర్ల డిమాండ్లు న్యాయపరమైనవి అని ఒప్పుకున్న సందర్భం ఉన్నది కావున తమ యొక్క న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే తీర్చాలి అని డాక్టర్లు డిమాండ్ చేయడం జరిగింది. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు వ్యతిరేకము కాదు అని కేవలం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మాధ్యమంగా మాత్రమే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాను అని డాక్టర్లు తెలియజేశారు. తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతో సహృద్భావ వాతావరణంలో ప్రభుత్వ ఆదేశాల మేర ప్రజల ఆరోగ్య దృష్ట్యా పనిచేసేందుకు కృషి చేస్తున్నామని పెద్ద మనసుతో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. డి ఎస్ హెచ్ వైద్యులు ఈరోజు కూడా భారీ సంఖ్యలో సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ రవీంద్ర, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాహుల్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జ్ఞానేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *