Breaking News

మహిళలకు రెండు వారాల సౌర శిక్షణా కార్యక్రమం విజయవంతం

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, హైదరాబాద్, ఎన్ఎస్ఐసి టెక్నికల్ సర్వీసెస్ సెంటర్‌ సహకారంతో, ఆస్ట్రేలియన్ ఎయిడ్ మద్దతుతో నిర్వహించిన రెండు వారాల “మహిళలకు సోలార్ శిక్షణా కార్యక్రమం” విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో 45 మంది మహిళలు 14 రోజుల పాటు శిక్షణ పొందగా, ముగింపు సందర్భంగా వారికి సౌర కిట్లు పంపిణీ చేశారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీ. ముత్తుకుమారన్, సర్టిఫైడ్ ఎనర్జీ ఆడిటర్ (CEA) మరియు మేనేజర్ (టెక్), ఎన్ఎస్ఐసి హైదరాబాద్, అలాగే వాసవ్య మహిళా మండలి కార్యదర్శి రశ్మి పాల్గొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నవారు సోల్‌ర్ ట్రాకింగ్ సిస్టమ్స్, గ్రిడ్, ఇన్వర్టర్స్ , DC & AC కేబుల్స్ మొదలైన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందారు.
వీటితో పాటు ప్రాక్టికల్ ఇన్‌స్టాలేషన్ మరియు భద్రతా మార్గదర్శకాలపై కూడా అవగాహన పొందారు. ఈ శిక్షణ మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి మరియు స్వయం ఉపాధికి సహకరిస్తుంది.
ముత్తుకుమారన్ మాట్లాడుతూ, మహిళలు సౌర శక్తి రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
రశ్మి మాట్లాడుతూ, ఈ కోర్సును వినియోగించుకొని మహిళలు పారిశ్రామికులు ఎదగాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నలుగురికి ఉపాధి కల్పించే దిశగా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఆమె సౌర వ్యవస్థల ఇన్‌స్టాలేషన్, భద్రతా సూచనలు మరియు మహిళలకు ఉన్న వృత్తి అవకాశాలపై విలువైన సూచనలు అందించారు. శిక్షణ మహిళల సాధికారతకు, స్వయం ఉపాధి అవకాశాల సృష్టికి మరియు పునరుత్పాదక శక్తి రంగంలో మహిళల భాగస్వామ్యానికి గట్టి పునాది నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలోవాసవ్య మహిళా మండలి ప్రతినిధులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *