గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అనధికారిక నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు మంగళవారం పాత గుంటూరు, పెద్దపలకలూరు , గోరంట్ల, హిమనీ నగర్, రెడ్డిపాలెం, బ్రాడీపేట ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించారు.
ఈ సందర్భంగా సిటి ప్లానర్ మాట్లాడుతూ బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ జీవో ప్రకారం 30 ఆగస్టు 2025 తరవాత నగరపాలక సంస్థ పరిధిలో అనధికార కట్టడాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ప్లాన్ లేకుండా నిర్మాణం చేసిన కట్టడాలను తొలగిస్తున్నారన్నారు. జిఎంసి పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే, వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ఈ డ్రైవ్ ప్రతిరోజు జరుగుతుందని, నిర్దేశిత అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో తాము కూల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే వార్డ్ సచివాలయాల వారీగా అనధికార, ప్లాన్ కి విరుద్ధంగా చేస్తున్న నిర్మాణాలను గుర్తించామని తెలిపారు.
Prajavartha Online Telugu News