Breaking News

డిజిటల్ గవర్నెన్స్ ఆకళింపుతో మహిళా కమిషన్ ముందడుగు

-సీఐఐ సమ్మిట్ ప్యానల్ చర్చలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ వెల్లడి

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాల్సిన అవసరం ఉందని.. అందుకు తగిన ప్రోత్సాహాలను అందించే మంచి ప్రభుత్వం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఇన్నోవేషన్ పాలసీలపైన.. డిజిటల్ గవర్నెన్స్ ను ఆకళింపు చేసుకుని మహిళల్లో అవగాహన చేస్తామని ఆమె స్పష్టం చేశారు. విశాఖపట్టణం సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన – సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం (Gender-Responsive Innovation: Building Inclusive Futures) అనే అంశంపై చర్చా గోష్టిలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ.. మేము మహిళల హక్కుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామన్నారు. మహిళల సమస్యల పట్ల ప్రభుత్వానికి సలహాదారులుగానూ ఉంటామన్నారు. ఇన్నోవేషన్ పాలసీలపై మహిళలు అవగాహనతో ముందుకెళ్లాలన్నారు. డిజిటల్ గవర్ననెన్స్ ను ఆకళింపు చేసుకుని ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఏపీలో మహిళా పక్షపాత ప్రభుత్వం నడుస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన మహిళా శక్తిని తయారు చేస్తున్నామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు. లింగ వివక్ష పోవాలంటే పట్టణాలు, గ్రామాల్లో అనేక అవగాహన క్యాంపులు చేపడతాన్నారు. మహిళలకు ఆన్ లైన్ సేఫ్టీ, అక్షరాస్యత పెంచడం, మహిళలపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వ పనితీరు మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. అప్పుడే మహిళల సాధికారత సాధ్యమవడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఈ చర్చా గోష్టికి మోడరేటర్ గా సిఐఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జి. మురళీ కృష్ణ వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *