Breaking News

అనుమతి లేనిదే భవనం నిర్మించరాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనుమతి లేనిదే భవనం నిర్మించరాదని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ గారి ఆదేశాల మేరకు, కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టడం జరుగుతున్నది, ఈ ప్రక్రియలో గవర్నర్‌పేట లో ఉన్న అనధికార కట్టడాలను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకున్నారని అన్నారు.

ఈ సందర్భంలో చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే, వాటిపై తక్షణ చర్యలు తీసుకోబడతాయని, VMC టౌన్ ప్లానింగ్ బృందం నిరంతర పరిశీలన చేపట్టి, అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించే కార్యక్రమం కొనసాగిస్తోందిని, కావున నగర ప్రజలు తమ నిర్మాణాలు అనుమతులతోనే చేపట్టవలెనని, లేనిపక్షంలో విధినిర్వహణ చర్యలు తప్పవని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *