విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని సర్కిల్–3 పరిధిలో పటమట హైస్కూల్ రోడ్ వద్ద ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ కళ్యాణ మండపంలో సఖి సురక్ష కార్యక్రమమును విజయవాడ నగరపాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించారు . ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామ్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్కిల్ టు పరిధిలో ఐ వి ప్యాలెస్ లో నిర్వహించారు, ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో ప్రభుత్వం స్వయం సహాయక బృందాలలో 35 సంవత్సరాలు దాటిన మహిళల కోసం సమగ్ర హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ, అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. SHG సభ్యులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. 15/11/2025 నుండి 20/11/2025 వరకు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ హెల్త్ క్యాంపులు కొనసాగనున్నాయని, ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా థైరాయిడ్, హిమోగ్లోబిన్, మూడు రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ సురేంద్ర, CDO లు ఉమామహేశ్వరి, జగదీశ్వరి, TE సుజాత, 11వ డివిజన్ TDP అధ్యక్షులు N. రాజేష్, COలు, RPలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News