Breaking News

వ్యక్తిగత శుభ్రత మన ఆరోగ్యానికి…. సామాజిక శుభ్రత మన సమాజ అభివృద్ధికి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యక్తిగత శుభ్రత మన ఆరోగ్యానికి…. సామాజిక శుభ్రత మన సమాజ అభివృద్ధికి కచ్చితంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఉదయం వాంబే కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని, ముఖ్యంగా ఆహారం సేవించే ముందు, మలమూత్రానికి వెళ్లిన తర్వాత సబ్బుతో చేతి అన్ని వేళ్ళు, చేతిలో ఉన్న గీతలు తో సహా హానికరమైన క్రిములు తొలగించేందుకు కడగాలని, అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ప్రజలకు ఉపయోగపడే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈనెల వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక పరిశుభ్రత పై చేస్తున్నారని, నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రజలకు అందరికీ కేవలం వ్యక్తిగత శుభ్రతలో అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక పరిశుభ్రత లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు.

కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు, మహిళలకు చేతులు కడిగే విధానాన్ని డాక్టర్లచేత ప్రత్యేకంగా చూపించడమే కాకుండా పిల్లల చేత చేయించారు, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి, వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత కొరకు ప్రజలకు చాటి చెప్పేలా ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గ, జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె. అర్జునరావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ బాబు శ్రీనివాసన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి. సోమశేఖర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *