Breaking News

జపాన్ నోట‌…తెలుగు మాట‌

-తెలుగు వారికి కృత‌జ్ఞ‌త‌లు
-భాగ‌స్వామ్య స‌ద‌స్సులో జ‌పాన్ రాయ‌బారి తెలుగు ప్ర‌సంగం
-తెలుగులో ఇదే నా మొద‌టి తెలుగు ప్ర‌సంగం
-ట్విట్ట‌ర్ వేదిక‌గా భావోద్వేగాన్ని పంచుకున్న జ‌పాన్ రాయ‌భారి ఓనో కీచ్చి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు వివిధ దేశాల్లోని పెట్టుబ‌డిదారుల‌ను ఆకట్టుకోవ‌డ‌మే కాదు. మ‌న తెలుగు భాష కూడా వారిని ఆక‌ట్టుకుంటోంది. ప‌రాయి దేశ‌స్తులైనా క‌ష్ట‌మైన కొంత‌మంది తెలుగు భాష మాధుర్యాన్ని చ‌విచూస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. త‌మ‌కు క‌ష్ట‌మైనా త‌మ నొట నుంచి కొన్ని తెలుగు ప‌లుకులు ప‌లికి ప‌ర‌మానంధ‌భ‌రితుల‌వుతున్నారు. ఇక జాప‌న్ దేశ రాయ‌భాఇఇ ఓనో కిచ్చీ అయితే ఏకంగా తెలుగోల‌నే ప్ర‌సంగం ప్రారంభించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య చ‌కితుల్ని చేశారు. జ‌పాన్ దేశ‌తో వాణిజ్య సంబంధాల‌పైన ఆయ‌న సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో ప్ర‌సంగిస్తూ తెలుగులో ప్ర‌సంగించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య చ‌కితుల్ని చేశారు.

ఈ రోజు సీఐఐ భాగస్వామ్య స‌ద‌స్సులో పాల్గొన్నందుకు నేను చాలా గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ అద్భుత‌మైన కార్య‌క్ర‌మం ద్వారా జ‌పాన్ మ‌రియు భార‌త‌దేశం కంపెనీల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అందిపుచ్చుకోవ‌డంపై నేను సంతోషిస్తున్నాను

అంటూ తెలుగులో మాట్లాడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య చ‌కితుల‌ను చేశారు. అంతే కాదు తెలుగు భాష‌పై త‌న‌కున్న అభిమానాన్ని ఆయ‌న భావోద్వేగ‌భ‌రితంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా కూడా పంచుకున్నారు.

న‌న్ను ఆహ్వానించినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు
అంటూ తెలుగులో ట్వీట్ చేసి, తెలుగులో ఇదే నా మొద‌టి ప్రసంగ‌మ‌ని తెలిపారు. జ‌పాన్ ఏపీల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు ఈ స‌ద‌స్సు ద్వారా మ‌రింత బ‌లోపేత‌మ‌వుతాయ‌ని తెలిపారు. స్టీలు, ఫార్మా, రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ, శ్రీసిటీ ,ట‌యోమా ప్రీఫెక్చూర్ లాంటి రంగాల్లో వాణిజ్య స‌హ‌క‌రం కొన‌సాగిస్తున్నామ‌ని, ఈ స‌దస్సు ద్వారా జ‌పాన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల మ‌ధ్య ఈ స‌హ‌కారం మ‌రింత బ‌లోపేత‌మై మ‌రింత‌గా కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *