Breaking News

జిల్లాను వెట్టి చాకిరీ రహిత జిల్లాగా మారుద్దాం

-వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
-వెట్టి చాకిరి నిర్మూలనకై జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వెట్టి చాకిరి నిర్మూలనకై జిల్లాస్థాయి నిఘా & పర్యవేక్షణ సంఘాన్ని (విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ) ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వెట్టి చాకిరి నిర్మూలనపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ… జిల్లాస్థాయి కమిటీ కి కలెక్టర్ చైర్పర్సన్ గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్ గా ఉంటారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, పిడి డిఆర్డిఏ, పిడి డ్వామా, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ, పోలీస్ శాఖ ల ప్రతినిధులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఎస్సీ లేదా ఎస్టి వర్గాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీ గ్రామాలు, పట్టణాలలో వెట్టి చాకిరి బాధితులను గుర్తించి, సంబంధిత వ్యక్తులపై చర్యలకై జిల్లా కలెక్టర్ కు నివేదిస్తుందని, ఆ బాధితుల పునరావాసానికి సూచనలిస్తుందని చెప్పారు. ఋణం వసూలుకై వేసిన కేసుల విషయంలో బాధితులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో వెట్టి చాకిరి లేకుండా చర్యలు చేపట్టాలని, వెట్టి చాకిరి నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ సంఘం నోడల్ అధికారి & కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి. ధనలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, డిఆర్డిఏ పిడి నాంచారరావు, డిపిఓ లావణ్య కుమారి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రియాంక, స్వచ్ఛంద సంస్థల ప్

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *