Breaking News

లిఫ్ట్ ఇచ్చి.. చేయూత నందించి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌తి సోమ‌వారం జిల్లాస్థాయి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే ప్ర‌జ‌లు క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి వ‌చ్చి క‌లెక్ట‌ర్‌కు అర్జీలు ఇస్తుంటారు. అయితే మిగిలిన రోజుల్లోనూ వ‌యోవృద్ధులు, విభిన్న ప్ర‌తిభావంతులు క‌లెక్ట‌ర్‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు వ‌స్తుంటారు. వీరి సౌక‌ర్యార్థం లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్‌ను సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. ఓ మాతృమూర్తితో రిబ్బ‌ను క‌త్తిరింప‌జేసి ప్రారంభింప‌జేశారు. క‌లెక్ట‌ర్‌గా ల‌క్ష్మీశ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌రి నుంచి క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో వ‌రుస‌గా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తూ అత్యుత్త‌మ ప్ర‌మాణాలు నెల‌కొల్పుతున్నారు.. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *