విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD, GoI) ఆదేశాల మేరకు, దేశవ్యాప్తంగా జెండర్ అసమానతలు, మహిళలపై హింస వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాలను అమలు చేసేందుకు DAY-NRLM (దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్)/AP-SERP (సెర్ప్) సంస్థలు స్వయం సహాయక సంఘాలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్చంద సంస్థలు మరియు పౌర సమాజ సంస్థల అనుసంధానంతో ఈ నెల నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23, 2025 వరకు “జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం” (National Campaign Against Gender Based Discrimination) నిర్వహించనున్నామని దీన్ని విజయవంతం చేయాలని అన్ని జిల్లాల సెర్ప్ అధికారులకు సెర్ప్ అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి/డైరెక్టర్ (IB), యన్. శ్రీరాములు నాయుడు ఆదేశించారు. తొలుత యన్. శ్రీరాములు నాయుడు, అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి/డైరెక్టర్ (IB), SERP జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరికీ జెండర్ క్యాంపైన్ లక్ష్యాలు, అవసరాన్ని వివరించారు. ఈ ఏడాది ప్రచారం “మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం”తో ప్రారంభమై, “నయీ చేతన–4” కార్యక్రమం కింద కొనసాగుతుందని తెలిపారు.
సమ్మిళిత వృద్ధి కోసం ఆర్థిక సాధికారత – వికసిత గ్రామీణ భారత్ కు మహిళలు ముందుండాలి అనే థీమ్ తో 2025 సంవత్సర ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, విజయవాడ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పథక సంచాలకులు (PDs), జిల్లా సమాఖ్యలు, HD విభాగాలు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు, CSOs మరియు ఇతర భాగస్వామ్య సంస్థలతో జూమ్ సమావేశం నిర్వహించారు.
డా. వి. శివ శంకర ప్రసాద్, డైరెక్టర్ — మానవాభివృద్ధి విభాగం, SERP వారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల మేరకు రూపొందించిన 4 వారాల కార్యాచరణ ప్రణాళిక, పోస్టర్లు, PPT లను వివరించారు. అన్ని శాఖలు, భాగస్వామ్య సంస్థలు కలసి ఈ క్యాంపైన్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు.
లైన్ డిపార్ట్మెంట్లు, CSOs, రాష్ట్రంలోని 26 జిల్లాల పథక సంచాలకులు, DRDA ప్రతినిధులు, జిల్లా సమాఖ్యలు, DGM/APM లు పాల్గొని, నెలరోజులపాటు జరిగే ఈ ప్రత్యేక జెండర్ అవగాహన ప్రచారాన్ని విజయవంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సమావేశం ముగింపు సందర్భంలో డా. వి. శివ శంకర ప్రసాద్ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశాన్ని ముగించారు.
Prajavartha Online Telugu News