Breaking News

ముత్యాలంపాడు సాయిబాబా గుడి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సేవ కార్యక్రమంలో ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరం ఎప్పుడు ముందుంటుందని, గత 19 సంవత్సరాలుగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పదవ తరగతి ఫీజు, స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని సాయిబాబా గుడి గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమి రెడ్డి తెలియజేశారు. స్థానిక ముత్యాలంపాడు సాయిబాబా గుడి ప్రాంగణంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెక్కులు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీ పి .కల్పలత చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు షిరిడీ సాయిబాబా మందిరం తరపున చేస్తున్న సహాయం వెలకట్టలేనిది అన్నారు. విద్యార్థినిలు విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం మందిర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పరీక్ష ఫీజులు స్టడీ మెటీరియల్స్, అందజేస్తున్నామని సాయిబాబా మందిరం తరుపున మాకు దాతలు చేసిన సహాయంతో వారిని చదివిస్తున్నామని అన్నారు. మాకు సాయిబాబా ఇలాంటి అవకాశం కల్పించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకుని పదవ తరగతి అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులై మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన విద్యార్థినిలసు కోరారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటి ర్యాంకులు సాధించిరని అన్నారు.ఈ కార్యక్రమంలో మందిర కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, మందిర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *