విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవ్య మహిళా మండలి పిల్లలతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTR జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాసవ్య చిల్డ్రన్ హోంలోని పిల్లలతో ముచ్చటించడం జరిగింది. భవిష్యత్ లో వారి ఆశయాలకు తగిన విధంగా చదువుపై దృష్టిని ఉంచాలని, మనిషికి సమస్య ఎదురైనప్పుడు కృంగి పోకుండా మనోధైర్యంతో ఎదుర్కోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు. మీలాంటి బాలలకు విద్య అందించడంలో ఎలాంటి అసౌకర్యాలు రాకూడదని ప్రభుత్వం వారు వాసవ్య మహిళా మండలి లాంటి సంస్థ లతో ఇలాంటి వసతి గృహాలను నిర్వహిస్తున్నామని కావున మీ ఏకాగ్రత అంతా చదువు మరియు మీరు భవిష్యత్ ప్రణాళిక పై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మరియు NTR జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి. సమరం, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి. కీర్తి, కార్యదర్శి జి. రష్మి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ పి. దీక్ష, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి, వాసవ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News