Breaking News

ప్రపంచ AIDS దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ AIDS దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్‌, JRC కాలేజ్ విద్యార్థుల సౌజన్యంతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్ పాల్గొని AIDS నివారణలో అవగాహన యొక్క ప్రాధాన్యతను గుర్తుచేశారు. వైద్య అధికారులు HIV/AIDS పై ఉన్న అపోహలు, భయాలు, మరియు వాస్తవాలను విశదీకరిస్తూ సురక్షిత జీవన శైలి, నియమిత పరీక్షలు, సరైన చికిత్స యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు వెంకటేశ్వర్లు కానూరు కిషోర్ సుధాకర్ JRC కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *