Breaking News

ప్రజారాజధాని అమరావతి ప్రాజెక్టులకై “రహదారి భద్రతా, డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ఇంటిగ్రేటెడ్ అర‍్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(AIUDP) అమలు కార్యకలాపాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు అమరావతిలోని APCRDA ప్రధాన కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ సమావేశ మందిరంలో PgMC(ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ), PMC(ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ), APCRDA, ADCL, కాంట్రాక్టర్స్ సిబ్బందికి “రహదారి భద్రతా & డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. అమరావతి రాజధాని నగరంలో జరుగుతున్న నిర్మాణ ప్రాజెక్టులలో రోడ్డు ప్రమాదాలను సున్నాకు తగ్గించడం, అలాగే ప్రమాదాలకు గురయ్యే వారి రక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని PgMC రోడ్డు భద్రత నిపుణులు అరుణ్‌కుమార్ గాజుల, PMC రోడ్డు భద్రత నిపుణులు ఎగ్గా కిరణ్‌కుమార్ నిర్వహించగా, APCRDA తరఫున కార్మిక కమిషనర్ అనితా వాణి భూపతి, గుడివాడ గోపీకృష్ణ, బోయ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే PgMC కెపాసిటీ బిల్డింగ్ బృందంలోని సూర్యనారాయణ, గంగాధరి, మనోహర్‌ రావు ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారికి డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులు, భవనాలు, భారీ భవన సముదాయాల నిర్మాణ దశలో పాటించాల్సిన రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణకు పాటించాల్సిన విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ఎంతో ప్రయోజనకరంగా అనిపించిందని పాల్గొన్నవారు అభిప్రాయపడి, ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను తరచుగా నిర్వహించాలని కోరారు.
అదేవిధంగా 2026 జనవరిలో జరగనున్న “రోడ్డు భద్రత మాసం” కార్యక్రమాన్ని అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో అమలవుతున్న 4E విధానం (ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ విభాగాలు), అందులోని భాగస్వాములను, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి నిర్వహించేందుకు APCRDA, PgMC, PMC సిబ్బంది ఆసక్తి వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *