అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని నేలపాడు గ్రామాన్ని సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవ తేజ ఐఎఎస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్. భాగ్యరేఖ తో కలసి సందర్శించారు. స్థానికంగా ఉన్న గ్రామకంఠాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన అదనపు కమిషనర్ ..9.2 కింద మినహాయింపులు, గ్రామ భౌగోళిక పరిస్థితులు, భూసరిహద్దులు, గ్రామపరిధి సంబంధిత అంశాలను అధికారులు, గ్రామపెద్దల నుంచి వివరంగా తెలుసుకున్నారు. గ్రామకంఠాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు CRDA చర్యలు తీసుకుంటుందని అడిషనల్ కమిషనర్ స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు, రైతులు గ్రామకంఠాలకు సంబంధించిన వివరాలు, సరిహద్దుల వివరణ, పెండింగ్లో ఉన్న పలు ఇతర అంశాలను అదనపు కమిషనర్ కి వివరించారు.
Prajavartha Online Telugu News