Breaking News

గ్రామకంఠాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని నేలపాడు గ్రామాన్ని సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవ తేజ ఐఎఎస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్. భాగ్యరేఖ తో కలసి సందర్శించారు. స్థానికంగా ఉన్న గ్రామకంఠాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన అదనపు కమిషనర్ ..9.2 కింద మినహాయింపులు, గ్రామ భౌగోళిక పరిస్థితులు, భూసరిహద్దులు, గ్రామపరిధి సంబంధిత అంశాలను అధికారులు, గ్రామపెద్దల నుంచి వివరంగా తెలుసుకున్నారు. గ్రామకంఠాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు CRDA చర్యలు తీసుకుంటుందని అడిషనల్ కమిషనర్ స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు, రైతులు గ్రామకంఠాలకు సంబంధించిన వివరాలు, సరిహద్దుల వివరణ, పెండింగ్‌లో ఉన్న పలు ఇతర అంశాలను అదనపు కమిషనర్ కి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *