Breaking News

మ‌న హ‌స్తక‌ళా వైభ‌వం.. సాంస్కృతిక సౌర‌భం..

– హ‌స్త‌క‌ళ‌లు, క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు వినూత్న కార్య‌క్ర‌మాలు
– ఈ నెల 8 నుంచి 14వ తేదీ వ‌ర‌కు జాతీయ హ‌స్త‌క‌ళా వారోత్స‌వాలు
– క‌ళాకారుల‌కు సాధికార‌త క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృషి
– రాష్ట్ర హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ డా. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌న హస్త‌క‌ళా వైభ‌వం.. సాంస్కృతిక సౌర‌భాల‌కు నెల‌వ‌ని.. హ‌స్తక‌ళ‌లు, క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు, సాధికార‌త క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మాల‌తో కృషిచేస్తోంద‌ని, ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు జాతీయ హ‌స్తక‌ళా వారోత్స‌వాల్లో భాగంగా వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు రాష్ట్ర హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌డీసీ) ఛైర్మ‌న్ డా. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ తెలిపారు.
రాష్ట్ర హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ డా. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ సోమ‌వారం నగ‌రంలోని గాంధీన‌గ‌ర్ లేపాక్షి ఎంపోరియంలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. జాతీయ హ‌స్త‌క‌ళా వారోత్స‌వాల్లో భాగంగా ఏపీహెచ్‌డీసీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 10న వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా, వోనిపెంట‌లో గురుశిష్య హ‌స్త్‌శిల్ప్ ప్ర‌శిక్ష‌ణ్ ప్రోగ్రామ్ (జీఎస్‌హెచ్‌పీపీ) ద్వారా 30 మంది ఇత్త‌డి, కంచులోహ‌పు హ‌స్త‌క‌ళాకారుల‌కు శిక్ష‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఈ నెల 12న ప‌ల్నాడు జిల్లా, దుర్గిలో 30 మంది క‌ళాకారుల‌కు డిజైన్ అభివృద్ధి వ‌ర్క్‌షాప్‌, 13న తిరుప‌తి జిల్లా, మాధ‌వ‌మాల‌, శ్రీకాళ‌హ‌స్తిలో క‌ల‌ప చెక్క క‌ళాకారుల‌కు టూల్ కిట్ల పంపిణీ, 14న అన‌కాప‌ల్లి జిల్లా, కె.డి.పేట‌లో 50 మంది క‌ళాకారుల‌కు టూల్‌కిట్ల పంపిణీ, డిసెంబ‌ర్ 15-21లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో 40 మంది క‌ళాకారుల‌తో ఏడు రోజుల గాంధీ శిల్ప్ బ‌జార్‌, 17న నంద్యాల జిల్లా, ఆల్ల‌గ‌డ్డ‌లో 50 మంది శిలా శిల్ప‌క‌ళాకారుల‌కు టూల్‌కిట్ల పంపిణీ ఉంటుంద‌న్నారు. భార‌త ప్ర‌భుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో 2023, 2024 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి హ‌స్త‌క‌ళా అవార్డుల ప్ర‌దానోత్స‌వం డిసెంబ‌ర్ 9న న్యూఢిల్లీ విజ్ఞాన్ భ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నుంద‌ని, మ‌న రాష్ట్రం నుంచి ముగ్గురు క‌ళాకారులు అవార్డులు అందుకోనుండ‌టం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. డి.శివ‌మ్మ (తోలుబొమ్మ‌లాట‌, శిల్ప‌గురు అవార్డు), గోర్స సంతోష్ (ఏటికొప్పాక బొమ్మ‌లు, జాతీయ అవార్డు 2024, పి.విజ‌య‌ల‌క్ష్మి (క‌లంకారి హ్యాండ్ పెయింటింగ్‌, జాతీయ హ‌స్త‌క‌ళా అవార్డు 2023)లు గౌర‌వ రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న‌ట్లు వివ‌రించారు. గౌర‌వ ప్ర‌ధానమంత్రి, రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రితో పాటు మంత్రివ‌ర్యులు ఎస్‌.స‌విత‌, చేనేత‌, హ‌స్త‌క‌ళ‌ల గౌర‌వ స‌ల‌హాదారు సుచిత్రా ఎల్లా, అధికారులు రాష్ట్రంలో హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధికి, హ‌స్త‌క‌ళాకారుల సంక్షేమానికి విశేష కృషిచేస్తున్నార‌ని, ఇందుకు వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. క‌ళాకారుల‌కు అవ‌స‌ర‌మైన చెక్క‌ను అందుబాటులో ఉంచేందుకు ఉడ్ బ్యాంక్‌ల‌ను అందుబాటులోకి తేవ‌డం జ‌రుగుతోంద‌ని డా. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ తెలిపారు.
స‌మావేశంలో రాష్ట్ర హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ ఎం.విశ్వ, లేపాక్షి ఓఎస్‌డీ ఐవీ
ల‌క్ష్మీనాథ్, ఎంపోరియం మేనేజ‌ర్ ఎం.సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *