– విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణలకు వచ్చే భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య తెలిపారు. సోమవారం ఆర్‌డీవో కావూరి చైతన్య.. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈవో వీకే శీనా నాయక్‌తో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, స్నాన ఘాట్లు, క్యూలైన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు తదితరాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో చైతన్య మాట్లాడుతూ భక్తుల భద్రతతో పాటు సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని.. రెవెన్యూ, దేవాదాయ, విజయవాడ నగరపాలక సంస్థ, పోలీసు తదితర శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, దసరా ఉత్సవాల విజయం స్ఫూర్తితో భవానీ దీక్షల కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు కావూరి చైతన్య తెలిపారు.
Prajavartha Online Telugu News