Breaking News

ప్రజల నుంచి 162 అర్జీలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు ప్రజల నుంచి 162 అర్జీలు అందాయని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ… అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. అర్జీ దారు కు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
162 అర్జీలలో నేరుగా 96, ఆన్లైన్లో 66 అర్జీలు వచ్చాయని చెప్పారు.
రెవిన్యూ శాఖకు అత్యధికంగా 65 అర్జీలు అందాయని చెప్పారు. పోలీసు శాఖకు 20, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖకు 26, పంచాయతీరాజ్ శాఖకు 10 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విద్యాశాఖకు ఆరు, పౌరసరఫరాల శాఖకు 5, వైద్య ఆరోగ్య శాఖకు 4,సర్వే, ఏపీ సీపీడీసీఎల్, జలవనరుల శాఖలకు 3చొప్పున, ప్రజా రవాణా శాఖ (ఏపీఎస్ఆర్టీసీ), డిఆర్డిఏ, కార్మిక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖలకు రెండు చొప్పున,గృహ నిర్మాణం, పశుసంవర్ధక శాఖ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సహకార శాఖ, అటవీ, దేవాదాయ, ఐసిడిఎస్, బీసీ సంక్షేమం, అగ్నిమాపక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.లక్ష్మీ నరసింహం, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *