Breaking News

జాతీయ వినియోగదారుల హక్కుల అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా నిర్వహిస్తున్న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా యన్‌.టి.ఆర్‌. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు మంగ‌ళ‌వారం విజయవాడ నగరంలోని, బందరు రోడ్డు నందు గల ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, వారి పైలెట్‌ సర్వీస్‌ స్టేషన్‌ పెట్రోలు బంకు నందు, జాతీయ వినియోగదారుల హక్కుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.వి. హరిప్రసాద్‌, డిప్యూటి కంట్రోలర్‌ ఆఫ్‌ లీగల్‌ మెట్రాలజీ శాఖ మరియు అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి.కుమారి, తూనికల కొలతలశాఖ వారు మరియు రమేష్‌ ఘడ్‌ మము సేప్టీ, ఆహార భద్రత శాఖ వారు, మరియు అసిస్టెంట్‌, కమీషనర్‌, జి.య.టి. శాఖ పి.పుల్లయ్య పాల్గొని, ఆయా శాఖల ద్వారా వినియోగదారులకు గల హక్కుల గురించి వినియోగదారులకు వివరించారు. వినియోగదారులు, పెట్రోలు బంకులలో, గోల్డ్‌ షాపులలో, రైతు బజార్లలలో గల హక్కుల గురించి తూనికలు కొలతల శాఖ వారు చెప్పగా, ఆహార భద్రత గురించి ఆ శాఖ వారు వివరించగా జి.యస్‌.టి. బిల్లుల ధరల గురించి జి.య.టి. శాఖ వారు చెప్పారు. ఈ కార్య క్రమాన్ని  కె. వెంకటప్పయ్య, మేనేజర్‌ పైలెట్‌ సర్వేస్‌ స్టేషన్‌ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమం మా పెట్రోలు బంకులో నిర్వహించటం మాకు ఆనందాన్ని కలిగించిందని,  మరిన్ని అవగాహన సదస్సులకు మేము ఎల్లప్పుడూ ముందుంటామని యజమాని యమ్‌.వి.వి.సత్యనారయణ చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *