విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో విద్యుత్ శాఖ, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల తో సమీక్ష సమావేశం జరిగింది.. మంగళవారం సాయంత్రం నియోజకవర్గంలోని 38,39,40,41,42,43,45 డివిజన్లకు సంబంధించిన డివిజన్ ల కూటమి ఇంచార్జ్ లు అధికారులతో ఆయా ప్రాంతాల్లోని పెండింగ్ సమస్యల పై చర్చించారు. పీజీఆర్ఎస్, ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పూర్తి చేయాలని అధికారులను డివిజన్ అధ్యక్షులు కోరారు.. ఇక నుంచి తరచుగా ఇటువంటి సమీక్షలు నిర్వహిస్తామని కూటమి నాయకులు తెలిపారు.. ఆయా శాఖలు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Prajavartha Online Telugu News