Breaking News

విధులు కేటాయించిన అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి… : డీ ఆర్ డీ ఏ పీడీ విజయలక్ష్మి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సరస్ మేళాలో విధులు కేటాయించిన అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీ ఆర్ డీ ఏ పీడీ విజయలక్ష్మి తెలిపారు. శనివారం సరస్ మేళా లో స్టాల్స్ , ఫుడ్ కోర్టు, భోజనశాల, ఎంమ్యూజ్మెంట్ పార్క్ వద్ద పరిశీలించి, అక్కడ విధులు కేటాయించిన అధికారులు ఉద్యోగులతో వివరాలు తెలుసుకున్నారు. శని ఆదివారాలు సెలవు దినాలు అయినందున ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్ ను సందర్శించే అవకాశం ఉన్నందున వివిధ ప్రాంతాల్లో విధులు కేటాయించిన అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ కోర్ట్ వద్ద నిరంతరం శుభ్రపరచాలని, స్టాల్స్ వద్ద వ్యర్ధాలను ఎప్పటికప్పుడు డస్ట్ బిన్లలో చేసి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. విధులు కేటాయించిన ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ డిఆర్డిఏ అధికారులు ఎగ్జిబిషన్ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *