Breaking News

రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్‌లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ప్లాట్ల వీధిపోట్లు, గ్రామకంఠాలు, LPS లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్‌మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్. లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేలో అర్జీదారులు తెలియజేసిన పలు ఫిర్యాదులకు..కమిషనర్ గారి ఆదేశాలమేరకు అధికారులు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం వద్దని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. అలాగే రైతుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ డేలో 26 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఇవి:
1.అమరావతిలో భూమి వ్యవహారాలు = 22
2. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్= 2
3. డెవలప్మెంట్ ప్రమోషన్= 1
4. సామాజిక సంక్షేమం(ఇంజినీరింగ్)= 1

గ్రీవెన్స్ డేలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్(క్యాపిటల్ సిటీ) వసంతరాయుడు, ప్లానింగ్ విభాగ డైరెక్టర్(FAC) బి. సురేష్ కుమార్, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు, డెవలప్మెంట్ ప్రమోషన్ జోనల్ జాయింట్ డైరెక్టర్ కె.ప్రవీణ, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.శేషిరెడ్డి, కే.ఎస్.భాగ్యరేఖ, జి. రవీందర్, బి. సాయి శ్రీనివాస నాయక్, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, సామాజిక సంక్షేమ విభాగ DCDO బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *