-ఎమ్మేల్యే డిఎన్ఆర్
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రకారం 4విడతలలో 26 వేల కోట్ల రూపాయలు అక్కచెల్లమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేయాలని చెప్పిన తేదీ ప్రకారం ఈ రోజు కేవలం కైకలూరు నియోజకవర్గనికి 46,76,54,896 కోట్ల రూపాయలు ఋణమాఫి జరిగిందని, దానిలో భాగంగా కలిదిండి మండలనికి వైఎస్సార్ ఆసరా2 వవిడత రూ. 14 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం కలిదిండి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా 2వ విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధీగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి తరుపున ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి అక్కచెల్లమ్మలకు ప్రతి సంక్షేమ పధకం నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, స్థాపించి రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన నేరుగా అందిస్తున్నారు. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థలలో మీరు అందరు కూడా జగనన్న సైనికులకు ఓట్లు వేసి గెలిపించారు అని, మీ రుణం నేను, ప్రజాప్రతినిధులు ఎప్పటికి తీర్చుకోలేం అని అన్నారు.ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని నిలుపుతూ మీరంతా నేను నిలబెట్టిన అన్నదమ్ములకు, అక్కచెల్లమ్మలకు ఓట్లు వేసి గెలిపించారన్నారు. అన్నారు. రాబోయే రోజులలో మీ అందరి ఆశీస్సులతో జగనన్న మరింత సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని, మరో ఇరవై ఇరవయ్యయిదేళ్లు జగనన్న మన ముఖ్యమంత్రి గా కొనసాగడం ఖాయం అన్నారు. అనంతరం అక్కచెల్లమ్మలకు రూ.14 కోట్ల రూపాయలు చెక్కును డ్వాక్రా బుక్ కీపర్లులకు అందజేశారు.కలిదిండి మండల అన్నదమ్ముల, అక్కచెల్లమ్మల రుణం ఎప్పటికి తీర్చుకోలేనిది అని..ఇదే ఆప్యాయత,అభిమానం మీ నుండి కోరుకుంటూ మీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన అన్నారు. శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.
కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత పాలకులు మాదిరి మోసం చేయకుండా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వైఎస్సార్ ఆసరా 2వ విడత సొమ్ములు మీ ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషం అని అన్నారు. ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు నాయకులు, ఎమ్మేల్యే గజ పూలమాల వేసి సన్మానించారు.డ్వాక్రా అక్కచెల్లమ్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
కార్యక్రమంలో జడ్పీటీసీ బొర్రా సత్యవతి,. వైస్ ఎంపీపీ కూసంపూడి కనకదుర్గరాణి,రాష్ట్ర హౌసింగ్ డైరక్టర్ గంటా సంధ్య, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరక్టర్ నంబూరి శ్రీదేవి,మాజీ జడ్పీటీసీ సభ్యులు చెన్నంశెట్టి కోదండరామయ్య ప్రసంగించగా, ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ,ఎంపీడీఓ పార్ధసారధి,సర్పంచ్ లు సాన మీనా సరస్వతి, బత్తిన ఉమామహేశ్వరరావు, నరహరశెట్టి నరసయ్య, అనపర్తి వడ్డికాసులు, తిరుమలశెట్టి జ్యోతి, గద్దె ఆనంద్,గండికోట ఏసుబాబు, గొర్ల వరలక్ష్మి, నున్న రాజేశ్వరమ్మ, ద్రోణాద్రి నాగలక్ష్మి,బొర్రా వెంకటలక్ష్మి,ఆళ్ల రాము, పీఏసీఎస్ అధ్యక్షురాలు ఊర కళ్యాణి, డీసీయంఎస్ డైరక్టర్ దాసి సరోజినీబాయ్, ఎంపీటీసీలు నీలి సుమన్, మహ్మద్ చాన్ బాషా,చెన్నంశెట్టి శిరీష,చవాకులు పద్మ, నరహరశెట్టి జయలక్ష్మి, టెక్కిం శ్యామ్, గోదావరి సత్యనారాయణ, ఇమ్మానేని లక్ష్మణరావు, నడకుదిటి రాంబాబు, కట్టా నాగలక్ష్మి,కో అప్షన్ సభ్యులు,హాఫిస్,,,నాయకులు నున్న కృష్ణబాబు, కొల్లాటి సత్యనారాయణ, మోకా రామకృష్ణ, దాసి ఏసుబాబు, పామర్తి సత్యనారాయణ, బొమ్మిడి ధనరాజు, సాగి వాసురాజు, చుండూరి లక్ష్మి, గంటా కోటేశ్వరరావు, నంబూరి బాబీ, గుడివాడ ఫణి, రేవు నరసింహరావు, దుగ్గిరాల రంగారావు, వలవల ప్రసాద్, మెండ నవీన్, బమ్మిడిపాటి సురేంద్ర,ఏకో నారాయణ, డ్వాక్రా అక్కచెల్లమ్మలు, సీసీలు, వియంకేలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News