Breaking News

పి.బి. సిద్ధార్థలో ఘనంగా తల్లిభాష వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగులో మాట్లాడటం, తెలుగులో రాయడం ద్వారానే మాతృభాష మనగలుగుతుందని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కన్వీనర్, సిద్ధార్థ అకాడమీ సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్ అన్నారు. శనివారం ఉదయం పి.బి. సిద్ధార్థ కళాశాల సెమినార్ హాలులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలను ఆయన ప్రారంభించారు. కళాశాల డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల మాట్లాడుతూ విద్యార్థులు తరచుగా పుస్తకాలు చదవడం, గ్రంథాలయాలకు వెళ్ళడం చేయాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో బి.కాం.ఫైనాన్స్ విద్యార్థిని ఎ.లక్ష్మీలాలస రాసిన అయోధ్య చేరిన కృష్ణ పుస్తక సమీక్షావ్యాసానికి మొదటి బహుమతి, బి.కాం. బీపీఎం విద్యార్థిని జి.రేష్మా గొప్ప స్నేహం గ్రంథ సమీక్షకు రెండో బహుమతి, బి.కాం. ఫైనాన్స్ విద్యార్థి షేక్  బర్హన్ తబస్సం అమరావతి కథలపై రాసిన సమీక్షావ్యాసానికి  మూడో బహుమతి ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేశ్ అందచేశారు. పద్యాలపన, కవితాపఠనం పోటీల్లో బి. కాం. ఫైనాన్స్ విద్యార్థులు  ఎల్. గణేశ్, జి. సూర్యసిద్ధార్థ, బి. ధర్మతేజలకు డైరెక్టర్ వేమూరి బాబూరావు బహుమతులు అందించారు. తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ సశ్రీ, తెలుగు సహాయచార్యులు డా.వై.పూర్ణ చంద్రరావు, డా. కె. సుబ్బారావు, డా. హేమబాంధవి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *