అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి పరిధిలో రాయపూడి – తుళ్లూరు గ్రామాలకు చేరువలో మేగా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన స్టాక్ పాయింట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు పరిశీలించారు. ఎల్పీఎస్ జోన్ – 6 అభివృద్ధికి తీసుకువచ్చిన మెటీరియల్ స్టాక్‌ను గుత్తేదారు ఇక్కడ ఉంచారు. ఈ ప్రమాదంలో ఎల్పీఎస్ నిర్మాణ పనులకు తీసుకువచ్చిన వివిధ రకాల యుటిలీటీ పైపులు అగ్నికి ఆహుతైనట్లు ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు సీహెచ్ ధనుంజయ సీఎండీ వారికి వివరించారు. ఇక్కడ పనిచేస్తున్నకార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పాపరు. అగ్ని ప్రమాదానికి కలిగిన కారణాలను లోతుగా పరిశోధించాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మేగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు.
Prajavartha Online Telugu News