విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ను రోయింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో ముందంజలో నిలిపే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు Sculling and Rowing Association of Andhra Pradesh అధ్యక్షుడు డా. Tarun Kakani తెలిపారు. రాష్ట్రంలో రోయింగ్ అభివృద్ధికి Ismail Baig మద్దతు కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నైపుణ్యమైన రోయింగ్ కోచ్‌ల కొరత ఉన్నదని, దీనివల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో కోచ్‌లను నియమించాలని ఇప్పటికే Sports Authority of Andhra Pradesh (SAAP)ను కోరినట్లు తెలిపారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఆంధ్రప్రదేశ్‌ను రోయింగ్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా Ismail Baig మాట్లాడుతూ, తాను ఆరు సార్లు ఒలింపిక్స్‌కు కోచ్‌గా సేవలందించిన అనుభవంతో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీతనని తెలిపారు. కృష్ణా నది రోయింగ్ క్రీడకు అత్యంత అనుకూలమని, సరైన సదుపాయాలు కల్పిస్తే జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే సామర్థ్యం ఈ ప్రాంతానికి ఉందన్నారు.
తరువాత డా. కాకాని, ఇస్మాయిల్ బేగ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కోచ్ శ్రీ కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News