Breaking News

అగ్ని ప్రమాదం జ‌రిగిన మేగా క్యాంపును ప‌రిశీలించిన ఏడీసీ సీఎండీ: డి. లక్ష్మీపార్థ‌సార‌థి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో రాయ‌పూడి – తుళ్లూరు గ్రామాల‌కు చేరువ‌లో మేగా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన స్టాక్ పాయింట్‌లో సోమ‌వారం అర్ధ‌రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాద స్థ‌లాన్ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు ప‌రిశీలించారు. ఎల్పీఎస్ జోన్ – 6 అభివృద్ధికి తీసుకువ‌చ్చిన మెటీరియ‌ల్ స్టాక్‌ను గుత్తేదారు ఇక్క‌డ ఉంచారు. ఈ ప్ర‌మాదంలో ఎల్పీఎస్ నిర్మాణ ప‌నుల‌కు తీసుకువ‌చ్చిన వివిధ ర‌కాల యుటిలీటీ పైపులు అగ్నికి ఆహుతైన‌ట్లు ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు సీహెచ్ ధ‌నుంజ‌య సీఎండీ వారికి వివ‌రించారు. ఇక్క‌డ ప‌నిచేస్తున్నకార్మికుల‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని చెప్పాప‌రు. అగ్ని ప్ర‌మాదానికి క‌లిగిన కార‌ణాల‌ను లోతుగా ప‌రిశోధించాల‌ని ఆమె ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. స్టాక్ పాయింట్ల‌లో ప్ర‌మాదాల నివార‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మేగా ఇంజినీరింగ్ సంస్థ ప్ర‌తినిధుల‌కు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *