Breaking News

గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :

గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా, ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ ను అదనపు కమిషనర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా 45 ఫిర్యాదులు అందాయని, పట్టణ ప్రణాళిక విభాగం 17, ఇంజినీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగానికి సంబందించి 3 ఫిర్యాదులు అందాయన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ఆర్జీలను విభాగాల వారిగా విబజించి, సంబంధిత విభాగాదిపతులకి పంపి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, యస్.ఈ జి. వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *