విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన చైత్రదీపిక ను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో అభినందించారు.
తైవాన్‌లో ఈ నెల ఏప్రిల్ 11 నుండి 19వ తేదీ వరకు జరిగిన ‘2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్’లో చైత్రదీపిక భారతదేశం తరఫున పాల్గొని, మెరుగైన ప్రతిభను చూపి యూత్ కేటగిరి లో ఇన్ లైన్ ఈవెంట్ లో రజత పతకం, సోలో డాన్స్ ఈవెంట్ లో కాంస్య పతకం మరియు క్యాడెట్ కేటగిరి లో షో గ్రూప్ ఈవెంట్లో రజత పతకాలు సాధించి వరుసగా నాలుగోసారి అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుతమైన క్రీడా ప్రతిభతో దేశానికి విశేషమైన గౌరవాన్ని తీసుకొంచింది. చైత్ర ఈ విజయాలు తో 61 పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుంది. భారతదేశం తరుపున స్కేటింగ్ లో ఆరు దేశాలకు (జపాన్, కొరియా, యుక్రెయిన్, ఆస్ట్రేలియా, నమీబియా మరియు నైజీరియా) దీటైన పోటీ యిచ్చి మూడు పతకాలు సాధించి దేశానికి ఏంతో పేరు తీసుకొంచింది. గత 2023, 2025లలో చైనా,తైవాన్ మరియు ఆస్ట్రేలియాలో లో జరిగిన 19th ఆసియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్షిప్ (వరల్డ్ స్కేటింగ్ అసోసియేషన్), తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటీషన్స్ మరియు వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె పలు విభాగాల్లో ఏడు బంగారు పతకాలను గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో దేశానికి విశేషమైన గౌరవాన్ని తీసుకొంచింది. దేశానికి, రాష్ట్రానికి, జిల్లా కు క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. చైత్రదీపిక ను పలువురు అధికారులు, ప్రజాప్రతినిదులు, క్రీడా అభిమానులు, స్నేహితులు, ప్రవాస ఆంధ్రులు, మరియు కుటుంబసభ్యులు ఆమెను అభినందించారు. టీం ఇండియా రోలరు స్కేటింగ్ కోచ్ పి. సత్యనారాయణ ను ప్రత్యేకంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిదులు, క్రీడా అభిమానులు, స్నేహితులు, ప్రవాస ఆంధ్రులు అభినందించారు.
జాతీయ ఐస్ స్కేటింగ్ శిబిరానికి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి చైత్ర దీపిక:
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఐస్ స్కేటర్ చైత్ర దీపిక Ice Skating Association of India నిర్వహిస్తున్న జాతీయ ఐస్ స్కేటింగ్ శిబిరానికి ఎంపికయ్యింది .ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణ శిబిరం 2026 ఏప్రిల్ 26 నుండి మే 9 వరకు Maharana Pratap Sports College, Dehradun లో నిర్వహిస్తారు. దీపిక ఈ జాతీయ శిబిరంలో నిపుణుల పర్యవేక్షణలో అధునాతన శిక్షణ పొందడం ద్వారా ఆమె ప్రతిభ మరింత మెరుగుపడి, రాబోయే జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతుంది. ఆమె సాధిస్తున్న విజయాలు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం కాగా, ఈ శిబిరానికి ఎంపిక కావడం ఆమె కృషి, ప్రతిభ, పట్టుదలలకు నిదర్శనం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ మునిసిపల్ కమీషనర్ గారిని వారి కార్యాలయంలో చైత్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది.
రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రని కు, జిల్లా కు మరియు విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని మునిసిపల్ కమీషనర్ ఆమెకు సూచించారు.
Prajavartha Online Telugu News