Breaking News

అభివృద్ధి పనులను వారం రోజుల కాల వ్యవధిలో ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మానస సరోవరం పార్క్ లోని చెరువు, నల్లపాడులోని తెలగమాంబ చెరువుల అభివృద్ధి పనులను వారం రోజుల కాల వ్యవధిలో ప్రారంభించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం చెరువుల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీయుజిబిసిఎల్) ప్రతినిధులు, జిఎంసి ఎస్ఈలతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతిపాదిత చెరువుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రణాళికాబద్ధమైన డే బై డే కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. చెరువుల అభివృద్ధిపై ఏపీయుజిబిసిఎల్ ప్రతినిధులు సిద్దం చేసిన డిజైన్ల మేరకు పనులు జరిగేలా జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని, ఏపీయుజిబిసిఎల్ ప్రతినిధులు కూడా తాము సిద్దం చేసిన డిజైన్ మేరకు పనులు జరుగుతున్నదీ, లేనిదీ పరిశీలించాలని సూచించారు. అలాగే నగరంలో చేపట్టిన ఇతర అభివృద్ధి పనుల్లో ఏపీయుజిబిసిఎల్ సిద్దం చేయాల్సిన ప్రతిపాదనలను వెంటనే ఇవ్వాలన్నారు.
పర్యటనలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఏపీయుజిబిసిఎల్ నుండి నాగేంద్రకుమార్, ఆంజనేయులు, బేబి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *