ఇంటింటా జాతీయ జెండా… ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

-ఆగస్టు 15 నుంచి పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్
-2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం
-ప్రతీ ఆగస్టు 15న సాధించిన ప్రగతిపై నివేదికలు
-పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషన్ బిల్డింగ్ లో ప్రతి పౌరుడినీ భాగస్వామిగా చేసేలా పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంలో… 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ నిర్ణయించుకునేలా ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై శనివారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పంద్రాగస్టు రోజన స్వాతంత్ర్య వేడుకల నిర్వహాణతో పాటు… నేషన్ బిల్డింగ్ దిశగా ప్రజల్లో చైతన్యం రగిలించేలా కార్యక్రమాలు రూపొందించాలి. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలి. ఆగస్టు 13-15వ తేదీ వరకు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసేలా చూడాలి. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికీ చేరాలి. 2047 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేసేలా ప్రొత్సహించాలి. రాష్ట్ర, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను డిజైన్ చేయాలి. గ్రామ స్థాయి నుంచి వివిధ రంగాల్లో లీడర్ షిప్ ఎదిగేందుకు వేదికలను సృష్టించాలి. గ్రామాల్లో ఒకప్పుడు ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని తిరిగి పునరుద్దరించాలి. దీనికి నేషన్ బిల్డింగ్ ఇన్ పార్టనర్స్ కార్యక్రమం వేదిక కావాలి. యువతలో ఉన్న ఆలోచనలను, ఎనర్జీలను నేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోవాలి. ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా.. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనలో స్టేక్‌ హోల్డర్లుగా మారాలి. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని మాస్ మూవ్‌మెంట్‌గా తీర్చిదిద్దాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనిత, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు.. పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు అండగా నిలవాలి

-సాగునీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించాలి -జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *