-ఒక్కరోజే 3.56 లక్షల ఇళ్ల సందర్శన
-13 రోజుల్లో మొత్తం 37.21 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు
-ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఫలాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అపూర్వ అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం విజయవంతంగా 13వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోజురోజుకూ మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 13వ రోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3.56 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించారు. దీంతో గత 13 రోజుల్లో మొత్తంగా 37.21 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఈ పర్యటనల్లో భాగంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ వెళ్ళి, ప్రతి కుటుంబానికి వివరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు తీరును, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విశేషాలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రతి చోటా పండుగ వాతావరణంలో టీడీపీ శ్రేణులు పర్యటిస్తున్నారు.
Prajavartha Online Telugu News