Breaking News

ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ విధులలో సిబ్బంది కి అంకితభావం అవసరమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. కొవ్వూరు పట్టణంలోని 6వ, 7వ వార్డు సచివాలయాలను బుధవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పందన ఫిర్యాదుల కు తప్పనిసరి గా రసీదు ఇవ్వాలని, సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అర్హతలేని లబ్ధిదారులకు వారికి తగిన కారణాలు వ్రాత పూర్వకంగా తెలియచేయాలని ఆదేశించారు. 90 శాతం పైగా ఫిర్యాదులు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోనే పరిష్కారం అవుతాయన్నారు. అయితే తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ వద్దకు ప్రతి సోమవారం ప్రజలు ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. వాలంటీర్లు పరిధిలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని సందర్శించి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. రికార్డుల నిర్వహణకు సంబంధించి సచివాలయ ఆధికారిని ఆర్డీవో మల్లిబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది హాజరు, బయోమెట్రిక్‌ విధానంతో పాటు జాబ్‌ చార్టు అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసే చార్టులు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. పథకాలు ఆమలుతో పాటు లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకుని, తగిన సూచనలు చేశారు.. స్వయంగా ఆర్డీవో రికార్డులను పరిశీలించి ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సి ఉందని స్పష్టం చేశారు. విధులకు గౌర్హాజరైతే శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను , వార్డు పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై వివరాలు అడిగారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *