Breaking News

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు . బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కెల్ రోడ్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, గాయత్రీ నగర్, ఐదవ నంబర్ రూట్, రమేష్ హాస్పిటల్స్ జంక్షన్, లయోలా కాలేజ్ రోడ్, హరిజనవాడ, డెంటల్ కాలేజ్ రోడ్, పుల్లేటికట్ట డ్రెయిన్, ఏలూరు రోడ్, ఎస్.ఆర్.ఆర్. కాలేజ్, గులాబీ తోట తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా గాయత్రీ నగర్‌లో జరుగుతున్న ఔట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్, పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాచవరం ఎస్.ఆర్.ఆర్.-సి.వి.ఆర్. కాలేజ్ సమీపంలోని రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి రహదారిని పునరుద్ధరించాలని సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై గుంతలు ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, గుంతలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం గులాబీ తోటలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. క్యాంటీన్‌లో ఏవైనా సమస్యలు గుర్తించిన వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కమిషనర్ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *