విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు.
బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్థంతి సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములను స్మరించుకోవడం మన భాధ్యత అన్నారు. అటువంటి మహానీయుల స్పూర్తితో సమాజ శ్రేయస్సు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాత:స్మరణీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ లక్ష్మి దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News