Breaking News

చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు… : జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అన్నారు.
బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్థంతి సందర్భంగా స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములను స్మరించుకోవడం మన భాధ్యత అన్నారు. అటువంటి మహానీయుల స్పూర్తితో సమాజ శ్రేయస్సు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాత:స్మరణీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్‌ లక్ష్మి దుర్గ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *