విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయవాడ సబ్‌కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ, ఒటిఎస్, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, గ్రామ వార్డు సచివాలయాల్లో పెండెన్సీ తదితర అంశాలపై తహాశీల్థార్లు, తదితర అధికారులు, సిబ్బందితో సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రారంభమైనందున ఎటువంటి లోటుపాట్లు లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో సమస్యలను తమ దృష్టికి తేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలు వేగవంతం చేయాలాన్నారు. ఎటువంటి జాప్యానికి తావు లేకుండా అపరిష్కృతం ధరఖాస్తులను పెండిరగ్లో లేకుండా ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఈ సందర్భంగా తహాశీల్థార్లతో వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, ఎస్ఆర్ఓ మ్యుటేషన్లు, పౌర సరఫరాలు అంశాలపై సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ సమీక్షించారు. ఆయా అంశాలలో పనులను వేగవంతం చేయడానికి అవసరమైన సూచనలను ఆయన అందజేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, విజయవాడ డివిజన్లోని అన్ని మండలాల తహాశీల్థార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News