Breaking News

అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన జనసేన…

-ప్రకాశం బ్యారేజ్ వద్ద తొలగించిన అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని పున ప్రతిష్ట చెయ్యాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి కార్యక్రమన్ని సోమారంగం చౌక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 50వ డివిజన్ జనసేన నాయకులు శిగినం శెట్టి రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ హాజరై పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులపాటు గాంధేయ మార్గంలో పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి ప్రతి ఆంధ్రుడు గుండెల్లో అమరుడై పొట్టి శ్రీరాములు నిలిచారని, వారు గాంధీజీ తో కొనియాడబడిన గొప్ప వ్యక్తిఅని, ఆలయాల్లోకి హరిజనుల ప్రవేశం కోసం ఇరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన గొప్ప వ్యక్తి అని అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు కొట్టేసి వెల్లంపల్లి ఫౌండేషన్ పేరు పెట్టుకునేందుకు తీరిక ఓపిక మంత్రి శ్రీను కి పుష్కలంగా ఉన్నాయి గాని ప్రకాశం బ్యారేజ్ వద్ద తొలగించిన పొట్టి శ్రీరాములు  కాంస్య విగ్రహాన్ని పున ప్రతిష్ట చేసేందుకు సమయం లేదా లేక మర్చిపోయారా? అని, పొట్టి శ్రీరాములుకి నివాళులు అర్పించే అర్హత మీకు లేదని. చిత్తశుద్ధి ఉంటే పునః ప్రతిష్ట పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. నగర ఉపాధ్యక్షులు వెన్న శివ శంకర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు  త్యాగం వల్లే తెలుగువారికి తెలుగుభాష రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి మహనీయుల ని స్మరించుకోలఅన్నారు, అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు కూర్మా రావు మాట్లాడుతూ రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి అయితే మీకు మనసు వస్తుందని దేశం కోసం ప్రజల కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలు పెట్టడానికి మీకు మనసు రావడంలేదని, శ్రీరాములు  లాగ ఒక్కరోజైనా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ysrcp నాయకులు దీక్ష చేసి చూస్తే పొట్టి శ్రీరాములు విలువ తెలుస్తుంది అని అన్నారు. నగర కమిటీ సభ్యులు మరి రెడ్డి రాఘవ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి అయ్యుండి కూడా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పున ప్రతిష్ట చేయలేకపోతున్నారని మీకు చేతకాకపోతే చెప్పండి పొతిన వెంకట మహేష్  ఒక్కరోజులో ఏర్పాటు చేస్తారని అన్నారు. అబ్దుల్ నజీబ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులపాటు గాంధేయ మార్గంలో పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి ప్రతి ఆంధ్రుడు గుండెల్లో అమరుడై పొట్టి శ్రీరాములు  నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో వి వి కె నరసింహారావు ప్రముఖ ఆర్యవైశ్య సంఘం నాయకులు, నుక్కల నాగేశ్వరరావు మాజీ కార్పొరేటర్, చనమలశెట్టి సిద్ధూ, జనసేన ముఖ్య నాయకులు స్టాలిన్, నాంచారయ్య, నగర కమిటీ సభ్యులు కొరవంజి రమణ, కృష్ణ మోహన్, బట్ట సాయి కుమార్, గన్ను శంకర్, సపింగ్కార్ నరేష్, దుర్గ భవాని, ఆలియా బేగం, రజిని, జనసేన నాయకులు బావి శెట్టి శ్రీను రాజా నాయుడు, చిన్నారావు మురళి కృష్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *