విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర శాసన పరిషత్తు అధ్యక్షుడు మోషేను రాజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఇటీవల శాసన పరిషత్తు అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మోషేను రాజు సోమవారం విజయవాడ రాజ్ భవన్ కు రాగా గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్ తో భేటీ అయిన శాసన పరిషత్తు అధ్యక్షుడు తన నేపధ్యం గురించి గవర్నర్ కు వివరించారు. బిశ్వభూషన్ హరి చందన్ ఇటీవల కరోనా నుండి కోలుకోగా ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి మోషేను రాజు వాకబు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
Prajavartha Online Telugu News