Breaking News

గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన శాసన పరిషత్తు అధ్యక్షుడు రాజు

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర శాసన పరిషత్తు అధ్యక్షుడు మోషేను రాజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఇటీవల శాసన పరిషత్తు అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మోషేను రాజు సోమవారం విజయవాడ రాజ్ భవన్ కు రాగా గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు.  గవర్నర్ తో భేటీ అయిన శాసన పరిషత్తు అధ్యక్షుడు తన నేపధ్యం గురించి గవర్నర్ కు వివరించారు. బిశ్వభూషన్ హరి చందన్ ఇటీవల కరోనా నుండి కోలుకోగా ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి మోషేను రాజు వాకబు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *