కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయాలు ద్వారా పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.. ప్రవీణ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కంకిపాడు మండలం కోలవెన్ను, నెప్పల్లి గ్రామాలలోని గ్రామ సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రజలకు అత్యుత్తమ పరిపాలన అందించేందుకు పాలనను ప్రజల గుమ్మం వద్దకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలపై వారికి అవగాహన కలిగించి, తదనుగుణంగా అర్హులైన వారిని ఆయా పథకాలకు దరఖాస్తు చేసే విధంగా వాలంటీర్లు కృషి చేయాలన్నారు. సచివాలయ పరిధిలో అర్హత ఉండి ప్రభుత్వ పధకాలు అందని కుటుంబం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి పధకాలు అందేలా, ప్రభుత్వం ఆశయాల మేరకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేయవలసి ఉంటుందన్నారు. పధకాలు పొందిన లబ్ధిదారుల జాబితాలను తప్పనిసరిగా సచివాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని, అదే సమయంలో అనర్హుల జాబితాలను కూడా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. పెన్షన్లు, రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునే వారికి అర్హత ననుసరించి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే జారీ చేయాలన్నారు. అనంతరం కొలెవెన్, కుందేరు, పొద్దుటూరు గ్రామాలలో జగనన్న లే అవుట్ లను సబ్ కలెక్టర్ పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ తోట సతీష్, ఎంపిడిఓ కె. అనురాధ, గృహ నిర్మాణ శాఖ, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News