Breaking News

ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) గా నియమితులైన  ప్రవీణ్ ప్రకాష్  బాధ్యతలు స్వీకరించే ముందుగా అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తరువాత ఢిల్లీ లోని ఏ.పీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏ.పీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఏ.పీ భవన్ పీ.ఆర్.సీ గా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం మాజీ పీ.ఆర్.సీ శ్రీ అభయ త్రిపాటి కి మరణానంతరం నివాళులు అర్పిస్తూ అధికారులు, సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.  ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *